Posts

Showing posts from August, 2021

ఎఫ్‌ఐఆర్ అంటే ఏమిటి ..?

  #ఎఫ్‌ఐఆర్_నమోదు_చేయడానికి_కాలపరిమితి_అంటూఏమీలేదు. పోలీస్ స్టేషన్ పోలీసులు అంటేనే ఒక రకమైన భయం చదువుకున్న వారు సైతం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు ఇవ్వడానికి బయపడుతారు. పెద్ద మనుషుల సాయం గాని రాజకీయ నాయకుల రేకామెండేషన్ లేనిదే పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేరు. ఏదైనా అవాంఛనీయ సంఘటన మూలంగా తాము గాని, తమ చుట్టూరా ఉన్నవారు గాని ఎవరైనా నష్టానికి, హానికి గురైనపుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం సమాజంలో ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. అయితే అత్యవసరమైన ఈ విషయంపై చదువురాని వారికే కాదు విద్యావంతులకు సైతం సరైన అవగాహన ఉండదు. పోలీసులు, పోలీస్ స్టేషన్ అంటేనే మనసులో అంతర్లీనంగా ఉన్న భయం వల్ల కూడా చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సందేసిస్తారు.  ఎఫ్‌ఐఆర్ గురించి విపులంగా తెలిసి ఉంటే అవసరమైన సందర్భాల్ల భయాలు, అనుమానాలు లేకుండా మనకున్న రక్షణ హక్కులను వినియోగించుకోవచ్చు. .                    #ఎఫ్‌ఐఆర్ అంటే..? పోలీసులు విచారణకు అర్హమైన నేరాన్ని గురించి సమాచారాన్ని అందుకున్నప్పుడు వారు తయారు చేసే ఒక రాత డాక్యుమెంట్. మొదటి సమాచార నివేదికను ఆంగ్లంలో ఫ...

ఇంజక్షన్_ఆర్డర్_అంటే_ఏమిటి ? రాండి ఇంజక్షన్ ఆర్డర్ల గురించి తెలుసుకుందాం!

  #ఇంజక్షన్_ఆర్డర్_అంటే_ఏమిటి ? వివిధ రకాల ఇంజక్షన్ ఆర్డర్ల గురించి   తెలుసుకుందాం* ఇంజక్షన్ ఆర్డర్ అనే నిషేధ ఉత్తర్వు (ఆజ్ఞ) పదాన్ని తరుచు వింటుంటాం సివిల్ తగదాల్లో ఇంజక్షన్ ఆర్డర్ చాలా ముఖ్యమైనది.ఆస్తి అమ్మకాన్ని , కొనుగోలుకు మరియు ఆక్రమణను నిషేధస్తుంది ఇంజక్షన్ ఆర్డరును తెలుగులో నిషేధ ఉత్తర్వు అని పిలుస్తారు. కోర్టు ఇచ్చిన నిషేధ ఉత్తర్వును దిక్కరిస్తే (ఉల్లంగిస్తే) జైలు శిక్ష లేక జరిమానా లేక రెండు కూడా విధించాని న్యాయవాది పేర్కొన్నారు. *ఇంజక్షన్ అంటే ఏమిటి?*  ఆస్తి మీది అయి ఉండి ఇతరులు అక్రమించుకోవడానికి ప్రయత్నం చేయుచున్న  లేక మీ ఆస్తిని ఇతరులు మాది అని అమ్మడానికి ప్రయత్నం చేయుచున్న, లేక మీ ఆస్తిని మీరు అమ్మకపోయిన ఇతరులు కొనడానికి ప్రయత్నం చేయుచున్న లేక మీ ఆస్తిని ఇతరులు నా ఆస్తి అని మీతో గొడవలు చేయుచున్న కోర్టును ఆశ్రయించి అమ్మడాన్ని గాని కొనడాన్ని గాన్ని ఆక్రమణకు గాని నిషేధిస్తూ తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు పొందవచ్చు. మీ పొరుగువారు ప్రతిరోజూ అర్ధరాత్రి బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేస్తూ మీతో ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మీరు పరిస్థితిలో జోక్యం చేసు...